విజయసాయిరెడ్డిగారూ.. ఇంత కాలానికి మీరు ఒక నిజం మాట్లాడారు: బుద్ధా వెంకన్న

  • చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని మీరు అన్నారు
  • సీబీఐ కోర్టు కూడా నిన్న ఇదే చెప్పింది
  • మీరు, జగన్ ఇక కోర్టుకు బయల్దేరండి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్ వేశారు. చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని మీరు అన్నారని... నిన్ననే సీబీఐ కోర్టు కూడా ఇదే స్పష్టం చేసిందని అన్నారు. తప్పులు చేసి తప్పించుకుని తిరగడం కాదు... ముందు కోర్టు విచారణకు హాజరుకావాలని ఎద్దేవా చేశారు. విచారణకు హాజరుకావాలని కోర్టు కూడా చెప్పింది... ఇక బయలుదేరండని అన్నారు.

విశాఖ, విజయనగరం జిల్లాల్లో భూములు కొట్టేసే పనిని విజయవంతంగా పూర్తి చేశారని వెంకన్న అన్నారు. పాత తప్పులకు మీరు, జగన్ ముందు శిక్ష అనుభవించండని చెప్పారు. కొత్త తప్పుల నుంచి ఎలాగూ తప్పించుకోలేరు... దానికీ ఏర్పాట్లు చేస్తున్నాం విజయసాయిరెడ్డిగారూ అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Budda Venkanna
Jagan
Telugudesam
YSRCP

More Telugu News